మరో సినిమా ఒప్పుకోవద్దు... సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి... నటికి రూల్స్ పెట్టిన నిర్మాతలు
- `దంగల్` ఫేం ఫాతిమా సనా షేక్ మీద నియమాల ఒత్తిడి
- `థగ్స్ ఆఫ్ హిందుస్థాన్`లో కీలక పాత్ర పోషిస్తున్న ఫాతిమా
- ఆనందంగా స్వీకరించిన నటి
ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఫొటో నెట్‌లో వైరల్‌గా మారడంతో ఫాతిమా మీద నియమాల ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే నిర్మాతల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, నియమాలను ఆనందంగా స్వీకరిస్తానని ఫాతిమా చెప్పినట్లు తెలుస్తోంది. సినిమా పేరు చెప్పకుండా ఆమె ఓ ఫస్ట్‌లుక్ ఫొటోను విడుదల చేసింది. అది `థగ్స్ ఆఫ్ హిందుస్థాన్` లుక్ అని అందరూ కనిపెట్టేసి, ఫొటోను వైరల్ చేశారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, కత్రినా కైఫ్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.