గాయని హర్షితను ఢిల్లీ శివార్లలో కాల్చి చంపిన దుండగులు
- రాగిణి సాంగ్స్ ద్వారా ఫేమస్ అయిన హర్షిత దహియా
- కారులో వెళుతుంటే అడ్డుకున్న హంతకులు
- తలలో గొంతులో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు
- అక్కడికక్కడే మృతిచెందిన యువ గాయని
కారును ఆపిన తరువాత, అందులో ఉన్న ఇద్దరిని వెంటనే కారు దిగాలని వారు హెచ్చరించారని, ఆపై అత్యంత సమీపం నుంచి పలు రౌండ్లు కాల్పులు జరుపగా, ఆరు బుల్లెట్లు ఆమెను తాకాయని చామరా సీనియర్ పోలీస్ ఆఫీసర్ దేష్ రాజ్ తెలిపారు. ఆ వెంటనే హంతకులు పారిపోయారని అన్నారు.
కాగా, తనకు బెదిరింపులు వస్తున్నాయని, చంపుతామని అంటున్నారని ఇటీవల హర్షిత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు, వీడియోలు పెట్టడం గమనార్హం. 'రాగిణి' సాంగ్స్ పాడుతూ, ఈమె చేసే నృత్యాలు హర్యానాలో ఎంతో ఫేమస్. హర్షిత హత్యపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.