చాలా మంది మనసులో అదే ఉంది... బయటపడలేకపోతున్నారంతే: చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యలు!

  • నవ్యాంధ్రను అభివృద్ధి చేస్తున్నా
  • విపక్ష నేతల నుంచి కూడా మద్దతు
  • మంచిని ప్రోత్సహించే వారికి స్వాగతం
  • కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
నవ్యాంధ్రను అభివృద్ధి చేయాలన్న తన కృత నిశ్చయానికి ఎంతో మంది విపక్ష నేతల నుంచి మద్దతు ఇప్పటికే లభించిందని, మరింత మంది మనసులో టీడీపీకి మద్దతివ్వాలని ఉన్నా, బయటపడలేకపోతున్నారని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు వైకాపా ఎంపీ బుట్టా రేణుకను టీడీపీలోకి ఆహ్వానించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిపక్ష నాయకులు కూడా హాజరవుతున్నారని గుర్తు చేసిన చంద్రబాబు, మంచిని ప్రోత్సహించాలని భావించే ప్రతి ఒక్కరికీ తాము స్వాగతం పలుకుతామని అన్నారు.

మరింత మంది టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పోలవరం నిర్మాణాన్ని ముందుగా అనుకున్న సమయానికి పూర్తి చేసే విషయంలో కేంద్రంతో చర్చిస్తున్నామని, నేడు తాను గడ్కరీని కలసి ఇదే విషయాన్ని మాట్లాడనున్నానని అన్నారు. కాగా, చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో ఫిరాయింపుల పర్వం మరింత కాలం పాటు కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
chandrababu
ap cm
butta renuka

More Telugu News