లైంగిక వేధింపుల ఆరోపణలతో అమెజాన్ స్టూడియోస్ హెడ్ తొలగింపు

  • నిర్మాతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ అమెజాన్ స్టూడియోస్ హెడ్ రాయ్ ప్రైస్
  • వేధింపులు బారిన పడ్డానని తెలిపిన టీవీ నిర్మాత ఇసా హక్కట్
  • తనను హార్వీ రేప్ చేసినప్పుడు రాయ్ కు ఫిర్యాదు చేశానన్న రోజ్ మెక్ గొవాన్
లైంగిక ఆరోపణల నేపథ్యంలో అమెజాన్‌ స్టూడియోస్ హెడ్‌ రాయ్‌ ప్రైస్‌ పై వేటు పడింది. ఈ మేరకు అమెజాన్‌ స్టూడియోస్ ప్రకటన జారీ చేసింది. రాయ్ ప్రైస్ తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ టీవీ నిర్మాత ఇసా హక్కట్‌ ఆరోపించింది. దీంతో ఆయనను విధుల నుంచి తొలగించినట్టు తెలిపింది.

కాగా, గతంలో నిర్మాత హార్వీ విన్ స్టైయిన్ తనను రేప్ చేసినప్పుడు రాయ్ ప్రైస్ కు పిర్యాదు చేశానని రోజ్‌ మెక్‌ గోవాన్‌ తెలిపిన సంగతి తెలిసిందే. దానిపై హార్వీని నిలదీయాల్సిన రాయ్, రేప్ జరిగందనడానికి ఆధారాలున్నాయా? అని అడిగాడని, అప్పుడు తానే ఆధారమని అరిచానని రోజ్ మెక్ గొవాన్ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై అమెజాన్ స్పందించకపోవడం విశేషం. 
Go Back to Shorts
harassment
america
amazon
rape

More Telugu News