రోజా చేతిలో ఓడిపోవడానికి కారణాలను వివరించిన గాలి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోజా చేతిలో ఓడిపోవడానికి కారణాలను వివరించిన గాలి!

  • ఓటమికి కారణం టీడీపీ నేతలు, కార్యకర్తలే
  • గెలిస్తే మంత్రిని అయ్యుండేవాడిని
  • ఎన్టీఆర్ మినహా అందరిపైన తొడగొట్టా
2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే మంత్రిని అయ్యేవాడినని గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన గురించి పూర్తిగా తెలుసు కాబట్టే... ఓడిపోయినా గుర్తింపునిచ్చారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా చేతిలో తన ఓటమికి కారణం నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలేనని అన్నారు. తన సేవలను నేతలు గుర్తించలేదని చెప్పారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని... ఎన్టీఆర్ మినహా ఇతర సీఎంలందరిపైన అసెంబ్లీలో తొడగొట్టానని అన్నారు.

ప్రభుత్వ పథకాల అమలులో 16 అంశాల్లో కుప్పం తర్వాతి స్థానంలో నగరి ఉందని గాలి చెప్పారు. నేతలు, కార్యకర్తలు ఈ విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని, పార్టీ ప్రతిష్టను పెంచాలని తెలిపారు. ఎన్నికలు ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉందని... బూత్ కమిటీలకు ఇద్దరి నుంచి ఐదుగురి వరకు నియమించుకుని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
gali mudhdukrishnama naidu
nagari constituency
Telugudesam
roja
ysrcp

More Telugu News