పాదయాత్ర చేసినంత మాత్రాన సీఎం అవుతారనుకోవడం మూర్ఖత్వం: కొత్తపల్లి గీత
- పాదయాత్ర ఒక పొలిటికల్ స్టంట్
- ప్రత్యేక హోదా రాదనే విషయం అందరికీ తెలుసు
- వైసీపీ ఎంపీలు రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలి
ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయం అప్పటి, ఇప్పటి నేతలందరికీ తెలుసని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని తెలిపారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రత్యేక హోదా వాగ్దానం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ మూడేళ్లుగా చెబుతున్నారని... వాళ్లు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.