కొనఊపిరితో ఉన్న ఆ జవాను భార్యకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే...!

  • కర్వాచౌత్ పర్వదినం సందర్భంగా ఉపవాసమాచరించిన దేవి
  • ఉగ్రవాది తూటాకు గాయపడి రక్తమోడుతూ భార్యకు ఫోన్ చేసిన సుబేదార్ కుమార్
  • ఉపవాసం విడిచి ఏదన్నా తిను అంటూ భార్య కర్వాచౌత్ కు చెప్పిన కుమార్
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆర్మీ అధికారి చేసిన ఫోన్ కాల్ అందరి గుండెలు పిండేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సుబేదార్ కుమార్ ఉత్తరకశ్మీర్ లోని బడ్గాం జిల్లాలో ఆర్మీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం కర్వాచౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని, కుమార్ భార్య దేవి ఉపవాసంతో పూజలు చేసింది.

ఆదివారం సాయంత్రం జరిగిన ఉగ్రపోరులో శత్రువు తూటాకి తీవ్రంగా గాయపడిన కుమార్ చివరి సారిగా తన భార్యతో మాట్లాడాలని అధికారులకు చెప్పి, తన భార్యకు ఫోన్ చేసి... ‘నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో మరణించాడు.

సోమవారం ఉదయం ఆమెకు కుమార్ మృతి చెందినట్టు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. నిన్న ఆయన భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఈ సంఘటనను గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరయ్యింది. దీంతో ఇది వెలుగు చూసింది. 
Go Back to Shorts
terrorists
bsf
army
loc

More Telugu News