కూర కలయబెట్టడానికి కూడా ఓ యాప్... రూపొందించిన స్విస్ కంపెనీ
- స్మార్ట్‌గా వంట చేసుకునే సదుపాయం
- ఒకే గిన్నెలో అన్ని రకాల వంటలు
- అన్నీ యాప్ ద్వారానే నియంత్రణ
తీరిగ్గా టీవీ చూస్తూ, గిన్నె మూత తీయకుండా పాత్రకు అనుబంధంగా వచ్చిన ప్రత్యేకమైన యాప్ ద్వారా కలయబెట్టొచ్చు. అంతేకాదు... ఇందులో వేపుళ్లు, ఫ్రైలు, ఉడకబెట్టడాలు ఇలా అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యాప్ ద్వారానే. `మాస్టర్‌సోస్` అని పిలిచే ఈ వంటపాత్రను ఎక్కడి నుంచైనా నియంత్రించవచ్చు. త్వరలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.