షాంపూ, సబ్బుల సంస్థ 'డవ్'పై తీవ్ర దుమారం!
- జాత్యహంకార పూరితంగా యాడ్
- బాడీ వాష్ వాడితే నల్లజాతీయురాలు తెల్లగా మారిపోతుంది
- మండిపడుతున్న నెటిజన్లు
శుభ్రమైన శరీరం అంటే తెల్ల రంగు శరీరం కాదని అట్లాంటాకు చెందిన ఓ ప్రొఫెసర్ మండిపడ్డారు. నల్ల రంగు శరీరం చెత్త, తెల్ల రంగు శరీరం శుభ్రమైనదనే విధంగా ఈ యాడ్ ఉందని అన్నారు. తాను డవ్ ఉత్పత్తులను చాలా కాలంగా వాడుతున్నానని... ఇకపై వీటిని వాడబోనని ఆయన తెలిపారు. డవ్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. ఇలాంటి జాత్యహంకార ప్రకటనలు ఇంతకు ముందు చాలాసార్లు ప్రచురించింది.