అలా మాట్లాడితే... నాకు, కేసీఆర్ కు తేడా ఏముంటుంది?: జానారెడ్డి
- కేసీఆర్ లా నీచంగా మాట్లాడలేను
- కేసీఆర్ పట్ల ప్రజల్లో ఆగ్రహం రావాలి
- టీఆర్ఎస్ ఓటమే.. కేసీఆర్ కు సరైన సమాధానం
మీడియా సమావేశంలో కేసీఆర్ భయంతో మాట్లాడినట్టు అనిపిస్తోందని అన్నారు. కేసీఆర్ లా తాను నీచంగా మాట్లాడలేనని... అలా మాట్లాడితే కేసీఆర్ కు, తనకు తేడా ఏముంటుందని చెప్పారు. కేసీఆర్ వ్యవహారశైలి పట్ల ప్రజల్లో ఆగ్రహం రావాలని... అప్పుడు వారు సంధించే ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని అన్నారు. కేసీఆర్ లా మాట్లాడేవారు కాంగ్రెస్ లో కూడా పుట్టుకొస్తారని అన్నారు.