దారుణం.. భర్త కళ్ల ముందే భార్య సామూహిక అత్యాచారం!
- కొడుకుని వైద్యుడికి చూపించేందుకు ముజఫర్ నగర్ వెళ్లిన దంపతులు
- వైద్యపరీక్షల అనంతరం తిరుగు ప్రయాణమైన భార్య, భర్త, కుమారుడు
- మార్గమధ్యంలో కారుతో అడ్డగించి, దాడి చేసి, గ్యాంగ్ రేప్
అనంతరం భర్తను కొట్టి, భార్యకు తుపాకి గురిపెట్టి ఆమెను రోడ్డుపక్కనున్న చెరకుతోటలోకి లాక్కెళ్లి అతని ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారు పరారైన అనంతరం అక్కడి పొలంలో పని చేసే రైతుల సాయంతో భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు, కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు.