హాల్ టికెట్ మీద అభ్యర్థి ఫోటోకి బదులు గణపతి బొమ్మ... బీహార్ యూనివర్సిటీ నిర్వాకం!
- బొమ్మ మాత్రమే కాదు సంతకం కూడా దేవుడిదే
- లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం
- మీడియాను ఆశ్రయించిన విద్యార్థి
అంతేకాదు.. సంతకం కూడా `గణేశ్` అని ఇంగ్లీష్‌లో ఉండటంతో ఆశ్చర్యపోయాడు. తన ఇంటి చిరునామాలో కూడా తప్పులు ఉండటంతో వెళ్లి యూనివర్సిటీ పరీక్షా విభాగాన్ని సంప్రదించాడు. అయితే అతని గోడును అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో మీడియాను ఆశ్రయించాడు. `నేను దరఖాస్తు చేసుకునేటప్పుడు అన్నీ సరిగానే నింపాను. హాల్ టికెట్ ఇలా రావడంతో ఆశ్చర్యపోయాను. కొత్త హాల్‌టికెట్ కోసం వెళ్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నా పరీక్ష వినాయకుడు వచ్చి రాస్తాడా?` అని కృష్ణ ప్రశ్నించాడు.
ఈ విషయం గురించి యూనివర్సిటీ అధికారులు మాట్లాడుతూ హాల్‌టికెట్ల ముద్రణ బాధ్యతలు చేపట్టిన ఇంటర్నెట్ సెంటర్ ఈ తప్పిదం చేసి ఉంటుందని అన్నారు.