kangana ranaut: సినిమా రంగానికి రాకుంటే కంగ‌నా నిన్ను `అంకుల్‌` అని పిలిచేది: హృతిక్ మీద మండిప‌డ్డ‌ కంగనా చెల్లి

  • నువ్వే కంగ‌నా వెంట ప‌డ్డావ్‌
  • `అంకుల్‌` వెంట ప‌డాల్సిన అవ‌స‌రం కంగనాకు లేదు
  • ట్వీట్ల వ‌ర్షం కురిపించిన రోలి ర‌నౌత్‌

వివాదాల క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌, హృతిక్ రోష‌న్‌ల మ‌ధ్య గొడ‌వ ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వారి మ‌ధ్య జ‌రిగిన‌ ఈ-మెయిళ్ల సంభాష‌ణ బ‌య‌టికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీని ఆధారంగా హృతిక్ త‌రఫు న్యాయ‌వాది కంగ‌నాకు వ్య‌తిరేకంగా కేసు కూడా వేశారు. ఈ ఈ-మెయిళ్ల‌లో కంగనా ర‌నౌత్ త‌న‌కు అస‌భ్య మెసేజ్‌లు చేసింద‌ని పేర్కొన్నాడు. అయితే దీనిపై కంగ‌నా చెల్లి రంగోలీ ర‌నౌత్ తీవ్రంగా స్పందించింది. ట్విట్ట‌ర్ వేదిక‌గా హృతిక్ మీద మండిప‌డింది.

`నిన్ను నువ్వు కాపాడుకోవ‌డానికి ఇంత క‌న్నా ఉత్త‌మ ప‌ని క‌నిపించ‌లేదా? ఎప్ప‌టిలాగే మ‌ళ్లీ ఈ-మెయిళ్ల చిట్టా బ‌య‌టికి తీశావ్‌! నీ మొద‌టి సినిమా విడుద‌లైన‌పుడు కంగ‌నా స్కూల్లో చ‌దువుకుంటోంది. ఒక‌వేళ తాను సినీ ప‌రిశ్ర‌మకి వ‌చ్చి ఉండ‌క‌పోతే నిన్ను ఇప్పుడు `అంకుల్‌` అని పిలిచేది. అందం, డ‌బ్బు ఉన్న కంగ‌నా లాంటి అమ్మాయి నీ లాంటి అంకుల్ వెన‌క ఎందుకు ప‌డుతుంది? నువ్వే త‌న వెంట ప‌డ్డావ్‌! ఇప్ప‌టికీ త‌న వెంట ప‌డుతూనే ఉన్నావ్‌. ఈ విష‌యం గురించి కంగ‌నా ప‌ట్టించుకోవ‌డం మానేసింది. నువ్వు కూడా వ‌దిలేసి నీ పిల్ల‌లు, భార్య మీద దృష్టి సారించు` అని రోలీ ట్వీట్లు చేసింది.

More Telugu News