ఫీఫా అండ‌ర్-17 ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌హిళా అంపైర్లు

  • ఎంపిక చేసిన ఫీఫా
  • అన్ని మ్యాచుల్లోనూ వీరే
  • స‌రికొత్త రికార్డు నెలకొల్ప‌నున్న ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌
భార‌త్‌లో శుక్ర‌వారం నుంచి ప్రారంభం కానున్న ఫీఫా అండ‌ర్-17 ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌లో జ‌ర‌గ‌నున్న‌ అన్ని మ్యాచుల‌ను మ‌హిళా రిఫ‌రీలు ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. పురుషుల మ్యాచుల్లో మ‌హిళ‌లు అంపైర్లుగా విధులు నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి. ఇందుకోసం మొత్తం ఏడుగురు మహిళా సహాయ రిఫరీలతో సహా మొత్తం 77 మంది రిఫరీలను ఫీఫా ఎంపిక చేసింది. ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా జ‌ర‌గ‌నున్న అన్ని మ్యాచుల‌ను వీరు ప‌ర్య‌వేక్షించ‌నున్నారు. వీరితో కలిసి శిక్షణ పొందేందుకు భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)కు చెందిన ఎనిమిది మంది రిఫరీలు, ఎనిమిది మంది సహాయ రిఫరీలకు కూడా ఫీఫా అనుమతి ఇచ్చింది.
Go Back to Shorts
fifa
football
world cup
under 17
woman refrees
first time

More Telugu News