పవిత్ర గంగానదిలో స్నానం చేసేందుకు సాధువుల నిరాకరణ.. కలుషితమైపోయిందని ఆరోపణ
- సాధువుల ఆరోపణలపై స్పందించిన మేజిస్ట్రేట్
- నీళ్ల నమూనాలు సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశం
ఉత్తరప్రదేశ్‌లోని షుకేర్తల్ ప్రాంతంలోని గంగానదిలో స్నానం చేసేందుకు సాధువులు నిరాకరించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున స్నానానికి తరలివచ్చిన సాధువులు నది నీళ్లు కలుషితమైనట్టు గుర్తించారు. దీంతో స్నానం చేసేందుకు నిరాకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు నల్లగా మారిపోయాయని, పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయని ఆరోపించారు. సాధువుల ఆరోపణలపై స్పందించిన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (జన్‌సాథ్) శ్యావద్ చౌహన్ నీళ్ల నమూనాలు సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.