హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం.. ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం.. ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం!

  • పలుచోట్ల ట్రాఫిక్ జామ్ 
  • మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం
హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం ప‌డుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ర‌హ‌దారులు జ‌ల‌మ‌యమ‌య్యాయి. ప‌లు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. వారాసిగూడ, హ‌బ్సిగూడ‌, తార్నాక, లాలాపేట, ఓయూ క్యాంప‌స్ ప్రాంతాల్లో ఓ మోస్త‌రు వ‌ర్షం ప‌డుతోంది. మాదాపూర్, గ‌చ్చిబౌలి, రాయ‌దుర్గం, నాచారం, మల్లాపూర్‌, ముషీరాబాద్‌, అంబ‌ర్ పేట్‌, విద్యాన‌గ‌ర్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వ‌ర్షం ప‌డుతోంది. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో మ‌రో రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.  
rain
hyderabad

More Telugu News