తేనెటీగల కారణంగా 90 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరిన విమానం
ఇంతకీ ఆటంకం కలగడానికి కారణం ఏంటో తెలుసా?.... తేనెటీగలు. అవును... బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న విమానం కుడి వైపు రెక్క మీద ఒక్కసారిగా వందల కొద్దీ తేనెటీగలు వచ్చి చేరాయి. దీంతో దాదాపు 90 నిమిషాల పాటు విమాన ప్రయాణాన్ని అధికారులు వాయిదా వేశారు. తేనెటీగలు ఎంతకీ వెళ్లకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పైపుల ద్వారా నీళ్లు కుమ్మరించి తేనెటీగలను చెదరగొట్టారు.