trump: కిమ్ పై సైనిక చర్యకు అన్నీ రెడీ: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

షార్ట్స్‌లో చూడండి
తరచూ క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలను ఆందోళనలకు గురి చేస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. యూఎస్ బాంబర్లను తాము కూల్చివేయగలమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని నార్త్ కొరియా విదేశాంగ మంత్రి ప్రకటించిన మరుసటి రోజు ట్రంప్ స్పందించారు.

'సైనిక చర్య' అన్న పదం తమ తొలి ఆప్షన్ కాదని, రెండో ఆప్షన్ గానే దాన్ని ఎంచుకున్నామని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాము రంగంలోకి దిగితే మాత్రం పూర్తి విజయం సాధించే వరకూ వదిలేది లేదని స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్ తో కలసి పాల్గొన్న సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ తెలిపారు.

కిమ్ జాంగ్ ఉన్ చాలా చెడు ప్రవర్తనను చూపిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేనంతగా రెచ్చిపోతున్నారని ట్రంప్ ఆరోపించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తున్నానని, ఇది తన అసలు స్టేట్ మెంట్ కాదని, అయితే, గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు ఉద్రిక్తతలు పెరిగాయని అంగీకరిస్తున్నానని చెప్పారు. అత్యంత సులువుగా సమస్యను పరిష్కరించుకునే పరిస్థితిలో ఉన్న నార్త్ కొరియా ఆ పనిని పక్కన బెట్టిందని విమర్శించారు.
Go Back to Shorts
trump
north koriya
kim jong un

More Telugu News