isro: తమిళనాడులోని ఇస్రో కేంద్రంలో అగ్ని ప్రమాదం.. కుట్ర కోణంపై దర్యాప్తు!

  • తమిళనాడులోని ఇస్రో సెంటర్ లో చెలరేగిన అగ్ని కీలలు
  • మహేంద్రగిరి పర్వతాల్లో ఇస్రో కేంద్రం
  • క్రయోజనిక్ ఇంజన్ లో వినియోగించే ద్రవ, ఘన ఇంధనం తయారీ యూనిట్ లో మంటలు
  • ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదని ప్రకటించిన శాస్త్రవేత్తలు
  • ఇందులో కుట్రకోణాన్ని వెలికి తీస్తామన్న పోలీసులు

తమిళనాడులోని ఇస్రో కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్రయోజినిక్ ఇంజన్లలో వాడే ద్రవ, ఘన ఇంధనాన్ని తయారు చేసే సెంటర్ లో అగ్నిప్రమాదం సంభవించడం ఆందోళన రేపుతోంది. దీని వివరాల్లోకి వెళ్తే... తమిళనాడులోని మహేంద్రగిరి పర్వతాల్లో ఉన్న ఇస్రో సెంటర్ లో నేటి తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిపై ఇస్రో ఉన్నతాధికారులు మౌనం దాల్చుతున్నారు.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... శాస్త్రవేత్తలు ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదు. అయినప్పటికీ మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడానికి కారణాలు అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ మంటలు ప్రమాదవశాత్తు రేగాయా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రేపారా? అన్న విషయాలపై దర్యాప్తు ప్రారంభించారు. కీలకమైన ఇస్రో కేంద్రంలో మంటలు రేగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 

More Telugu News