అశ్విన్, జడేజాలను ఇక మరచిపోవచ్చు: వీరేంద్ర సెహ్వాగ్
- అద్భుతంగా రాణిస్తున్న కులదీప్, చాహాల్
- స్టార్ బౌలర్లు లేని లోటు తెలియనివ్వడం లేదు
- కితాబిచ్చిన మాజీ ఓపెనర్ సెహ్వాగ్
కోహ్లీ సైతం చాహాల్ ను పిలిచి మరీ బౌలింగ్ ను అప్పగిస్తున్నాడని, నేటి మ్యాచ్ లోనే ఇండియా సిరీస్ ను గెలుచుకుని 3-0 ఆధిక్యంలోకి వెళుతుందని తాను భావిస్తున్నానని అన్నాడు. ఇద్దరు అనుభవజ్ఞులు లేని లోటు తెలియడం లేదని 'ఇండియా టీవీ 'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ లో ఎన్నో ఏళ్ల తరువాత భారత్ తరఫున హ్యాట్రిక్ తీసిన ఘనతను కులదీప్ యాదవ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.