కంచ ఐలయ్య విదేశీ ఏజెంట్.. టెర్రరిస్టుల కంటే డేంజరస్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ బిగాల
- కంచ ఐలయ్య ఓ పిచ్చోడు
- దేశాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా ఐలయ్య సిద్ధం
- ఐలయ్య ఓ విదేశీ ఎజెంట్
- కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
అమెరికా డాలర్లను ఇస్తే తీసుకోవడానికి తాను సిద్ధమంటూ ఐలయ్య చేసిన వ్యాఖ్యలు దారుణమని గణేష్ అన్నారు. దేశాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా ఈయన వెనుకాడడని మండిపడ్డారు. టెర్రరిస్టుల కంటే ఐలయ్యలాంటి వారు చాలా డేంజరస్ అని అన్నారు. విదేశీ ఏజెంట్ గా మారిన ఐలయ్య... దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పరిపూర్ణానంద స్వామి అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకుండా ఐలయ్య దాటవేశాడని అన్నారు. దేశద్రోహి ఐలయ్యను దేశం నుంచి తరిమికొట్టాలని ప్రధానమంత్రి మోదీని కోరుతామని చెప్పారు.