rana: రానాకు సూపర్ క్రేజ్: మాల్ లో 10 నిమిషాలకి 15 లక్షలు అందుకున్నాడట!

షార్ట్స్‌లో చూడండి
'బాహుబలి' సినిమా రానా కెరియర్ నే మార్చేసింది. ఈ సినిమా ఆయనను ఒక్కసారిగా స్టార్ ను చేసేసింది. ఆ తరువాత చేసిన 'ఘాజీ' తోను .. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలతో ఆయన తన క్రేజ్ ను కాపాడుకున్నాడు. దాంతో భారీ ప్రాజెక్టుల నుంచి ఆయనకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆయనను పెద్ద పెద్ద సంస్థలు సంప్రదిస్తున్నాయి.

 ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలపై కంటే వ్యాపార ప్రకటనలపైనే ఎక్కువగా సంపాదిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందుకుగాను ఆయన భారీ మొత్తాన్ని పారితోషికంగా తీసుకుంటున్నాడని సమాచారం. రీసెంట్ గా ఒక మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన రానా .. అక్కడ 10 నిమిషాలు మాత్రమే వున్నాడట. అందుకుగాను ఆయనకి 15 లక్షలు ముట్టాయనే టాక్ వినిపిస్తోంది. రానాకి గల క్రేజ్ ఏ స్థాయిలో వుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.           
Go Back to Shorts
rana

More Telugu News