హనీప్రీత్ పాత్రలో నటిస్తానంటున్న రాఖీసావంత్
- రామ్ రహీమ్ జీవితకథతో సినిమా తీస్తా!
- వారి జీవితాలను బయటపెడతా!
- హనీప్రీత్ లండన్‌లో ఉండొచ్చు
- రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాఖీ, అక్కడే డేరా సచ్చా సౌధాలాగే ఉండే సెట్ వేయించి, అందులోనే సినిమా షూటింగ్ చేస్తామని పేర్కొంది. గుర్మీత్ వ్యవహారాలన్నింటినీ బయటపెట్టిన తర్వాతే తాను ఊపిరి పీల్చుకుంటానని రాఖీ తన అభిమానులకు మాట ఇచ్చింది. గతంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసు ఆధారంగా రూపొందించిన `ఏక్ కహానీ జూలీ కీ` సినిమాలో షీనా బోరా పాత్రను రాఖీ పోషించింది. అప్పుడు కూడా షీనా బోరాకి, తనకి మంచి స్నేహం ఉందని రాఖీ వెల్లడించిన సంగతి తెలిసిందే.