సిమెంట్ రోడ్డు వేశాకే వీధిలోకి రండి... సీఎం రమేష్ కు చేదు అనుభవం!
- మూడేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడెందుకొచ్చారు?
- మాటలు వద్దు, చేతలు కావాలి
- రోడ్డు వేశాకే 'ఇంటింటికీ టీడీపీ' కార్యక్రమం నిర్వహించండి
- సీఎం రమేష్ ను అడ్డుకున్న మహిళలు
మూడేళ్లుగా సిమెంట్ రోడ్డు వేయమని మొత్తుకుంటున్నా పట్టించుకున్న నాధుడు లేడని వారు వాపోయారు. సిమెంట్ రోడ్డు వేశాకే తమ వీధిలోకి రావాలని వారు డిమాండ్ చేశారు. మాటలతో ఉపయోగం లేదని, చేతల్లో చూపించాలని వారు సీఎం రమేష్ కు స్పష్టం చేశారు. దీంతో స్థానిక నాయకత్వంతో కలిసి ఆయన వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా మహిళలు శాంతించకపోవడం విశేషం. అదే సమయంలో పలువురు సర్పంచ్ లు స్పెషల్ గ్రాంటు కింద చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని సీఎం రమేశ్ దృష్టికి తీసుకెళ్లారు.