nagarjuna: నాన్న ప్రతి పుట్టిన రోజుకు మేము చేసేది ఇదే: నాగార్జున

షార్ట్స్‌లో చూడండి
తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ప్రముఖ సినీ నటుడు నాగార్జున తెలిపారు. హైదరాబాదులో నిర్వహించిన 'రాజు గారి గది-2' సినిమా ట్రైలర్ లాంఛ్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నాన్నగారి ప్రతి పుట్టిన రోజున అంటే సెప్టెంబర్‌ 20న అందరం ఆయన ఇంట్లో కలుస్తాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి నేను నేరుగా అక్కడి నుంచే వస్తున్నా. నాన్న ఇంటికి వెళ్లగానే ఓ ఎనర్జీ, చిరునవ్వు వచ్చేస్తాయి' అని నాగార్జున గుర్తు చేసుకున్నారు. ఎన్ని పనులు ఉన్నా నాన్న పుట్టిన రోజున ఆయన ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ చేసి, ఇతర కార్యక్రమాల్లో మునిగిపోతామని ఆయన తెలిపారు. అనంతరం ట్రైలర్ లాంఛ్ చేశారు. 
Go Back to Shorts
nagarjuna
rajugarigadi-2
akkineni

More Telugu News