వైజాగ్ టూ హైదరాబాద్ రూ. 1249... ఇండిగో సూపర్ ఆఫర్ల వివరాలివి!
- దాదాపు గరుడా సర్వీస్ ధరకు విమాన ప్రయాణం
- 12 గంటల పాటు సమయం ఆదా
- ఇండిగో వెబ్ సైట్లో ఇంకా లభిస్తున్న చౌక ధర
ఇక 'ఏపీ 7 ఏఎమ్' టీమ్ ఇండిగో వెబ్ సైట్ లో ఈ ధరపై టికెట్ల గురించి వెతుకగా, వచ్చే నెలలో రూ. 1,249 ధరపై విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 11, 12, 15, 17, 19, 27, 29, 31 తేదీల్లో చౌక ధరకు టికెట్లు ఉన్నాయి. మామూలుగా అయితే, ఈ రెండు నగరాల మధ్యా సూపర్ లగ్జరీ బస్సు టికెట్ రూ. 746 కాగా, ప్రయాణ సమయం 14 గంటలు. ఇక గరుడా ప్లస్ సర్వీస్ అయితే, రూ. 1,171 టికెట్ ధర కాగా, 12 గంటల సమయం పడుతుంది. ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈ మార్గంలో గంటన్నర వ్యవధిలో గమ్యస్థానానికి చేర్చే విమాన ప్రయాణానికి మరో మరో 100 రూపాయలు కేటాయిస్తే సరిపోతుంది.