dhoni: కోహ్లీ వల్లే రాణిస్తున్న ధోనీ: గంగూలీ కీలక వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
ఓ వైపు మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన ప్రోత్సాహమే తనను ఇంతటి వాడిని చేసిందని ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెబుతుంటే, గంగూలీ వాదన మరోలా ఉంది. గత సంవత్సర కాలంగా ధోనీ చక్కగా రాణిస్తుండటాన్ని ప్రస్తావించిన ఈ మాజీ కెప్టెన్, కోహ్లీ కారణంగానే ధోనీ మెరుగ్గా ఆడుతున్నాడని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ధోనీ 9 వేలకు పైగా పరుగులు చేశాడని గుర్తు చేసిన ఆయన, తన కెరీర్ ముగిసేలోపు మరిన్ని పరుగులు చేస్తాడని, అందుకు కోహ్లీ అతనిపై ఉంచిన నమ్మకమే కారణమని అన్నాడు.

 ధోనీపై పూర్తి భరోసాను ఉంచిన కోహ్లీ, అతన్ని స్వేచ్ఛగా ఆడనిస్తున్నాడని అన్నారు. కెప్టెన్ గా బాధ్యతలు పోషిస్తున్న కోహ్లీ, తన సహచరుడు, మార్గదర్శి అయిన ధోనీపై ఎంతో నమ్మకాన్ని చూపిస్తున్నాడని, అందుకు కోహ్లీకి కూడా కొంత క్రెడిట్ ఇవ్వాలని సూచించారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో మంచి ప్రతిభను కనబరిచిన హార్దిక్ పాండ్యా, భవిష్యత్తులో టీమిండియాకు ఓ కలిస్ వంటి ఆటగాడిగా మారనున్నాడని గంగూలీ అభిప్రాయపడ్డారు. కలిస్ ను ఆదర్శంగా తీసుకోవాలని పాండ్యాకు సూచించారు.
Go Back to Shorts
dhoni
kohli
gangooly

More Telugu News