కేసీఆర్ సారూ!...నీ కూతురు కవిత కూడా ఇవే సీరలు కట్టుకుని బతుకమ్మ ఆడుతదా?: మహిళల ప్రశ్న
- గద్వాల చీరలని వంద రూపాయల చీరలు అంటగడతారా?
- ఈ చీరలు కట్టుకుని కవిత బతుకమ్మ ఆడుతదా, కేసీఆర్ సారూ?
- పేదలంటే చులకనా?
- వంద రూపాయల చీర కోసం 300 కూలి వదిలిపెట్టి వచ్చినం
- రోడ్డుపై బతుకమ్మ పంపిణీ చీరలను తగులబెట్టిన మహిళలు
బతుకమ్మ ఉత్సవాల్లో ఈ చీరలు కట్టుకుని కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత బతుకమ్మ ఆడతదా? అని పలువురు మహిళలు ప్రశ్నించారు. పేద మహిళలంటే అంత చులకనా, కేసీఆర్ సారూ? అని వారు నిలదీశారు. 60-70 రూపాయలకు వచ్చే చీరలను ఎవరైనా పండుగపూట కట్టుకుంటరా? అని వారు మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను రోడ్డుపై వేసి తగులబెట్టి, తమ నిరసన తెలిపారు.