kanche ilaiah tgv: కంచ ఐలయ్య లాంటి వారు దేశ ద్రోహులతో సమానం!: ఎంపీ టీజీ వెంకటేశ్

షార్ట్స్‌లో చూడండి
సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రొ.కంచ ఐల‌య్య లాంటి వారు దేశ ద్రోహులతో సమానమని మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంక‌టేశ్ వ్యాఖ్యానించారు. ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అంటూ పుస్త‌కం రాసిన ఐలయ్య తీరుపై హైదరాబాద్ లో ఆర్యవైశ్య మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన విష‌యం తెలిసిందే. ఈ సమావేశంలో టీజీ వెంక‌టేశ్ మాట్లాడుతూ... ఇలా రాసేవారిని అరబిక్ దేశాలలో నడి రోడ్డు మీదే శిక్షిస్తారని, మతాన్ని, కులాన్ని అవ‌మాన‌ప‌రిచే ఐల‌య్య లాంటి వాళ్లను న‌డిరోడ్డుపై ఉరి తీసేలా మ‌న దేశంలోనూ చ‌ట్టాలు తీసుకురావాలని వ్యాఖ్య‌లు చేశారు. అలా చేస్తేనే ఇటువంటి ఘ‌ట‌న‌లు తగ్గుతాయని అన్నారు. ఐల‌య్యకు మ‌ద్ద‌తుగా నిలుస్తోన్న నేత‌ల‌ను మతిభ్రమించిన నేతలుగా టీజీ వెంక‌టేశ్ అభివ‌ర్ణించారు. ఐలయ్యపై అన్ని ప్రాంతాల్లోనూ కేసులు పెడ‌తామ‌ని అన్నారు.   
Go Back to Shorts
kanche ilaiah tgv

More Telugu News