రజనీ కెరియర్లోనే 'కాలా' ఓ రికార్డ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీ కెరియర్లోనే 'కాలా' ఓ రికార్డ్!

  •  వేగంగా జరుగుతోన్న 'కాలా' షూటింగ్
  •  ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి 
  • 'కబాలి' కన్నా వేగంగా పూర్తవుతోన్న 'కాలా'
  • రజనీనే ఆశ్చర్యపరుస్తోన్న రంజిత్   
రజనీ కథానాయకుడిగా వచ్చిన 'కబాలి' చిత్రం భారీ వసూళ్లను సాధించింది. దర్శకుడు రంజిత్ చాలా తక్కువ సమయంలో ఈ సినిమా షూటింగును పూర్తి చేసి .. అంతే వేగంగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో ఆయనకి తనతో మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు రజనీకాంత్. ఫలితంగా 'కాలా' సినిమా సెట్స్ పైకి వెళ్లింది.

'కబాలి' సినిమా షూటింగ్ కన్నా వేగంగా రంజిత్ 'కాలా' షూటింగును పూర్తి చేస్తుండటం రజనీకాంత్ కే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందట. ఇప్పటికే ఈ సినిమా 70 శాతం వరకూ షూటింగును పూర్తి చేసుకోవడం విశేషం. రజనీ కెరియర్లో చాలా తక్కువ సమయంలో షూటింగును పూర్తి చేసుకుంటున్న సినిమా ఇదేననీ, ఈ విషయంలో 'కబాలి' రికార్డును 'కాలా' అధిగమించేసిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ధనుష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో హ్యూమా ఖురేషి కథానాయికగా కనిపించనుంది.     
rajanikanth
huma qureshi

More Telugu News