జెమినీ టీవీకి 'జై లవ కుశ' శాటిలైట్ రైట్స్
Add ap7am to your home Screen

జెమినీ టీవీకి 'జై లవ కుశ' శాటిలైట్ రైట్స్

ఎన్టీఆర్ .. బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన 'జై లవ కుశ' సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. ఈ నెల 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో టీజర్ ను .. ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 ఇక భారీ రేటుకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడైనట్టు సమాచారం. శాటిలైట్ రైట్స్ విషయంలో గట్టి పోటీ ఏర్పడగా .. భారీ మొత్తం చెల్లించి జెమినీ టీవీ వారు సొంతం చేసుకున్నట్టుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయడం .. ముగ్గురు కథానాయికలు ఆయన జోడీ కట్టడం .. ఎన్టీఆర్ మూడు పాత్రలకి సంబంధించిన లుక్స్ కి మంచి మార్కులు పడటం .. టీజర్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం ఈ స్థాయిలో శాటిలైట్ రైట్స్ పలకడానికి కారణమని చెప్పుకుంటున్నారు.    
ntr
rasi khanna

More Telugu News