shriya: నిజం చెబుతున్నా.. ఇన్నాళ్లకు సరైన కథ దొరికింది : శ్రియ

షార్ట్స్‌లో చూడండి
తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ కథానాయకుల జోడీగా వరుస అవకాశాలను సంపాదించుకుంటూ శ్రియ తన కెరియర్ ను పరిగెట్టిస్తోంది. తన గ్లామర్ తో కుర్రకారు మనసులు దోచేస్తూ వచ్చిన శ్రియ, ఇక భయపెట్టే సినిమాల్లోను నటించడానికి రెడీ అవుతోంది. నయనతార, త్రిషల మాదిరిగా సస్పెన్స్ థ్రిల్లర్ కథల వైపు అడుగులు వేస్తోంది.

త్వరలో తాను 'సైకో థ్రిల్లర్' నేపథ్యంలో సాగే సినిమా చేయనున్నట్టు ఆమె చెప్పింది. ఈ తరహా సినిమాల్లో చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాననీ, అలాంటి కథ తనని వెతుక్కుంటూ రావడం ఆనందంగా, ఆశ్చర్యంగా ఉందని అంది. ఓ 23 యేళ్ల కుర్రాడు తనని ఈ కథతో మెప్పించాడనీ, ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడని చెప్పింది. ఈ సినిమాలో తాను కొత్తగా కనిపిస్తాననీ, త్వరలోనే సెట్స్ పైకి వెళుతున్నామని స్పష్టం చేసింది.    
Go Back to Shorts
shriya

More Telugu News