: గుర్మీత్ కు కేవలం పదేళ్ల జైలు శిక్షే ఎందుకు పడింది? యావజ్జీవం ఎందుకు పడలేదు?

డేరా సచ్చాసౌధా అధినేత గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కు ఒక్కో అత్యాచారం కేసులో కేవలం పదేళ్ల శిక్షను మాత్రమే ఎందుకు విధించారు? యావజ్జీవ కఠిన కారాగార శిక్ష ఎందుకు విధించలేదు? అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. గుర్మీత్ రాం రహీంపై ఐపీసీ సెక్షన్లపై శిక్షను ఖరారు చేశారు. మైనర్లపై అత్యాచారాలను నిరోధించే పోక్సో చట్టం గుర్మీత్ కు వర్తించలేదు. దీంతోనే అతను యావజ్జీవ కఠిన కారాగార శిక్ష నుంచి తప్పించుకున్నాడు.

అయినప్పటికీ ఒక్కో అత్యాచారం కేసులో పదేళ్ల చొప్పున శిక్ష విధించడంతో మొత్తం 20 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపే అవకాశం ఉంది. అయితే పోక్సో చట్టాన్ని 2013లో అమలులోకి తెచ్చారు. గుర్మీత్ 2002లో అత్యాచారానికి పాల్పడ్డాడు. 2005లో అతనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతనిపై పోక్సో చట్టం వర్తించలేదు. దీంతో కేవలం పదేళ్ల జైలు శిక్ష, 15 లక్షల చొప్పున జరిమానాకు పరిమితమయ్యాడు. మొత్తంగా 20 ఏళ్ల జైలు శిక్ష, 30 లక్షల జరిమానా విధించారు. 

More Telugu News