: వీడియో గేమ్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్న కిమ్ జాంగ్ ఉన్... ఏడుగురు అమెరికన్ సైనికులను చంపేసిన వైనం!

అమెరికాకు చెందిన ఓ జలాంతర్గామిపై తమ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా దాడి చేసి, ఏడుగురు అమెరికన్ సైనికులను హతమార్చి ఆనందించారని ఉత్తర కొరియా అధికార మీడియా ప్రకటించింది. 'హంటింగ్ యాంకీ' అనే 3డీ గేమ్ ను ఆవిష్కరించిన కిమ్ జాంగ్, ఓ యూఎస్ సబ్ మెరైన్ ను అంతం చేసి, అందులో దాగున్న యూఎస్ మెరైన్స్ ను చంపారని తెలిపింది. కాగా, అమెరికా, ఉత్తర కొరియా దేశాల మధ్య ఉన్న పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు ఓ కంపెనీ ఈ గేమ్ ను విడుదల చేసింది. ప్రజల్లో, సైనికుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఈ గేమ్ ఉపకరిస్తుందని ఉత్తర కొరియా చెబుతుండగా, అమాయకులైన ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ఈ తరహా గేమ్ లు కూడదని అమెరికా హెచ్చరించింది. ఏదిఏమైనా అమెరికాపై యుద్ధం చేయాలన్న తన కోరికను కిమ్ జాంగ్ ఇలా వెరైటీగా తీర్చుకున్నారన్నమాట!

More Telugu News