: అనుకున్నంత పనీ చేసిన ట్రంప్.. హిజ్రాలపై ఉక్కుపాదం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పనీ చేశారు. ఆ దేశ మిలిటరీ రంగంలో హిజ్రాల నియామకాలను నిషేధిస్తామంటూ గతంలోనే ట్రంప్ ప్రకటించారు. దీంతో, అమెరికా వ్యాప్తంగా ట్రంప్ నిర్ణయంపై హిజ్రాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కన్నీటిపర్యంతం అవుతూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. అయినా, ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మిలటరీలో పని చేయడానికి హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందని చెప్పిన ట్రంప్... దేశీయ మిలటరీలో హిజ్రాలు చేరకుండా నిషేధం విధిస్తూ సంతకం చేశారు.

 దీంతో, రక్షణ సేవల్లో హిజ్రాల సేవలు, వారి నియామకాలు రద్దవబోతున్నాయి. హిజ్రాలకు కేటాయిస్తున్న నిధులను వెంటనే ఆపివేయాలని దేశీయ డిఫెన్స్ డిపార్ట్ మెంట్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ లకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ట్రంప్ నిర్ణయాన్ని ట్రాన్స్ జెండర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని హెచ్చరించారు. 

More Telugu News