taapsee: 'బిగ్ బాస్' హౌస్ లో తాప్సీ సందడి!

సాధారణంగా ఏదైనా ఛానల్లో ఒక షో పాప్యులర్ అయిందంటే, ఆ షో ద్వారా తమ సినిమాలను ప్రచారం చేసుకోవడమనే కల్చర్ మనకి బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కల్చర్ టాలీవుడ్ ను కూడా ప్రభావితం చేసినట్టుగా అనిపిస్తోంది. 'స్టార్ మా'లో ప్రసారమవుతోన్న'బిగ్ బాస్' షోకి రేటింగ్ పెరుగుతూ పోతోంది. దాంతో ఈ షో ద్వారా తమ సినిమాలను ప్రచారం చేసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు.

 అందులో భాగంగానే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా రిలీజ్ కి ముందు 'బిగ్ బాస్' హౌస్ ను రానా సందర్శించాడు. అక్కడివారితో కలిసి సందడి చేశాడు. అలాగే తన తాజా చిత్రం 'ఆనందో బ్రహ్మ' రేపు విడుదలవుతుండటంతో, 'బిగ్ బాస్' హౌస్ లోకి తాప్సీ అడుగుపెట్టింది. సినిమా నేపథ్యానికి సంబంధించిన గెటప్ తో ఆమె 'బిగ్ బాస్' హౌస్ లో సందడి చేసినట్టు సమాచారం. ఈ రోజు రాత్రి 9 గంటల 30 నిమిషాలకి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.    

More Telugu News