: 10,000 గుడ్లతో జంబో ఆమ్లెట్...వీడియో చూడండి

బెల్జియంలో కోడి గుడ్ల ఫిప్రానిల్‌ అనే రసాయనం ఉంటుందని, ఇది అనారోగ్య కారకమని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అక్కడ కోడి గుడ్ల అమ్మకాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీంతో బెల్జియం వాసుల్లో గుడ్లపై ఉన్న అపోహలు తొలగించేందుకు ‘ది వరల్డ్‌ ఫ్రేటర్నిటీ ఆఫ్‌ నైట్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ ఆమ్లెట్ ఉత్సవం నిర్వహించింది. మాల్ మెడీ పట్టణంలో నిర్వహించిన ఈ వేడుకలో 10,000 కోడిగుడ్లతో అతి పెద్ద ఆమ్లెట్‌ ను తయారు చేసింది. ఈ వేడుకకు వచ్చిన వారందరికీ దీనిని పంచి ఇచ్చింది. అయితే అన్ని గుడ్లతో ఆమ్లెట్ ఎలా వేయగలిగారన్న అనుమానం వచ్చిందా? అయితే ఈ వీడియో చూడండి.

More Telugu News