kajal: హీరోయిన్ గా ఆమె రాణిస్తుందని ముందే చెప్పాను:కాజల్

షార్ట్స్‌లో చూడండి
అందం ... అభినయం కలిస్తే కాజల్ అని ఆమె అభిమానులు చెబుతుంటారు. తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా సుదీర్ఘ కాలంగా కాజల్ తన హవాను కొనసాగిస్తోంది. అలాంటి కాజల్ కొత్తగా వచ్చిన కథానాయికలు కూడా చాలా బాగా చేస్తున్నారని చెప్పింది. ఈ మధ్య కాలంలో తెరపైకి వచ్చిన కథానాయికలలో తనని రీతూ వర్మ ఎక్కువగా ఆకట్టుకుందని అంది.

 రీతూ వర్మ నటన చాలా సహజంగా అనిపిస్తూ .. ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందని చెప్పింది. గతంలో 'బాద్షా' చిత్రంలో తనకి ఆమె చెల్లెలిగా నటించిందనీ, ఆమె మంచి కథానాయిక అవుతుందనే విషయాన్ని తాను ఆనాడే చెప్పానని అంది. రీతూ వర్మ నటన కట్టిపడేయడం వల్లనే తాను 'పెళ్లి చూపులు' సినిమాను చాలాసార్లు చూశానంటూ చెప్పుకొచ్చింది. 
Go Back to Shorts
kajal
rituvarma

More Telugu News