40 రోజులకు పవన్ కల్యాణ్ కు 40 కోట్లు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

40 రోజులకు పవన్ కల్యాణ్ కు 40 కోట్లు?

త్వరలో తాను పూర్తి సమయాన్ని రాజకీయాలకి కేటాయించనున్నట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. అందువలన ఆయన చకచకా రెండు మూడు సినిమాలు చేయనున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ తో ఒక సినిమా సెట్స్ పై వుంది. ఇక మైత్రీ మూవీస్ బ్యానర్లో పవన్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు.

 ఈ సినిమా కోసం పవన్ 40 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట. ఇందుకుగాను ఆయన అందుకునే పారితోషికం 40 కోట్లు అనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా తమిళంలో హిట్ కొట్టిన విజయ్ సినిమాకి రీమేక్ అనీ .. ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. పవన్ కి పోలీస్ పాత్రలంటే ఎంత ఇష్టమో తెలిసిందే. మళ్లీ ఆయన పోలీస్ పాత్రలో కనిపించనుండటం నిజమే అయితే అభిమానులకి అంతకి మించిన ఆనందం లేదు. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ పేరు వినిపిస్తోంది.        
pavan

More Telugu News