: 'జీఎస్టీ అమలులో మనమే గ్రేటెస్ట్'... సోషల్ మీడియాలో ఎద్దేవా!

వివిధ దేశాల్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు రేటు ఎలా ఉందో ప్రస్తావిస్తూ పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిగతా అన్ని దేశాల కన్నా ఇండియాలోనే అత్యధికంగా జీఎస్టీ పన్ను 28 శాతం (పెట్రో ఉత్పత్తులపై మాత్రం 33 శాతం) ఉండటంపై నెటిజన్లు 'జీఎస్టీ అమలులో మనమే గ్రేటెస్ట్' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అతి తక్కువ జీఎస్టీ అమలు చేస్తున్న దేశాలు ఇండియాకన్నా ఎంతో ఆర్థికాభివృద్ధిని సాధించాయని గుర్తు చేస్తున్నారు.

ఇక ప్రపంచంలో అతి తక్కువ జీఎస్టీ అమలు చేస్తున్న దేశంగా మయన్మార్ ఉంది. ఇక్కడ జీఎస్టీ కేవలం 3 శాతం మాత్రమే. ఈ నేపథ్యంలో ఏ దేశంలో ఎంత జీఎస్టీ వసూలు చేస్తున్నారో ఒక్కసారి పరిశీలిస్తే...

కెనడా: 15 శాతం
చైనా: 17 శాతం
జపాన్: 8 శాతం
కొరియా: 10 శాతం
కువైట్: 5 శాతం
మలేషియా: 6 శాతం
మారిషస్: 15 శాతం
మెక్సికో: 16 శాతం
న్యూజిలాండ్: 15 శాతం
ఫిలిప్పైన్స్: 12 శాతం
రష్యా: 18 శాతం
సింగపూర్: 7 శాతం
సౌతాఫ్రికా: 14 శాతం
థాయ్ లాండ్: 7 శాతం
యూఏఈ: 5 శాతం
అమెరికా: 7.5 శాతం
వియత్నాం: 10 శాతం
జింబాబ్వే: 15 శాతం

More Telugu News