: గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై ఆవిష్కృతమైన యోగాద్భుతం!

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా గ్రేట్ వాల్ ఆఫ్ చైనాపై యోగాద్భుతం ఆవిష్కృతమైంది. భారత ఎంబసీ, యోగి యోగా సంస్థల ఆధ్వర్యంలో వందలాది మంది చైనీయులు గ్రేట్ వాల్ పై యోగాసనాలు వేశారు. ఇండియా తరువాత ప్రపంచంలో అత్యధికులు యోగా చేసేది చైనాలోనే కావడం గమనార్హం. ఇక యోగా డే జరపాలన్న భారత ప్రతిపాదనకు మద్దతు పలికిన చైనా ప్రభుత్వం ప్రతి సంవత్సరమూ అధికారికంగా యోగా డేకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో పాటు, బీజింగ్ తదితర ముఖ్య నగరాల్లోనూ యోగా దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఇక, చైనాలో యోగాకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు 20 మంది యువతీ యువకులను ఎంపిక చేసిన భారత రాయబార కార్యాలయం, వారిని చైనాకు పంపించింది. వీరంతా యోగాలో అత్యంత క్లిష్టమైన హఠయోగాసనాలు వేసి, యువతలో ఆసక్తిని పెంచుతున్నారు.

More Telugu News