ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఘాటుగా స్పందించిన పవన్ కల్యాణ్
ప్రత్యేక హోదా కోసం దీక్షకు దిగుతామని ప్రకటించిన ఆంధ్ర యువతకు మద్దతు ప్రకటించిన జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ నిన్న పలు పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను పెట్టిన మొదటి సభ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై గళం విప్పుతున్న ఆయన కొన్ని రోజుల నుంచి ప్రతీరోజు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా ఏపీ ప్రత్యేక హోదాను కోరుకుంటోందంటూ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఆంధ్రుల అభిలాషను తెలిపారు. ‘ఆంధ్రులు.. ఈ దేశ ప్రజలు.. కేంద్రంలో ఉండే నాయకులకి, పార్టీలకి బానిసలు కాదు’ అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.
#APDemandsSpecialStatus ఆంధ్రులు ..ఈ దేశ ప్రజలు..
— Pawan Kalyan (@PawanKalyan) 25 January 2017
కేంద్రం లొ వుండె నాయకులకి,పార్టిలకి బానిసలు కారు..
'