: స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీలు త్వరగా ఛార్జ్‌ అయ్యే విధానాన్ని కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు

అమెరికాలోని బాత్‌, ఇలినాయిస్‌ విశ్వవిద్యాలయాల్లోని శాస్త్రవేత్తలు స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌తో పాటు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రికరాల్లో ఉప‌యోగించే లిథియం బ్యాట‌రీలను తొంద‌గా ఛార్జ్ అయ్యే ఓ నూతన విధానాన్ని క‌నుగొన్నారు. మాంగనీస్‌ ఆక్సైడ్‌తో చేసిన సొరంగం లాంటి నిర్మాణాల్లో పొటాషియం లాంటి భార లోహ అయాన్లను చేర్చడం ద్వారా వాటిల్లో ఛార్జింగ్ తొంద‌ర‌గా ఎక్కేలా చేయ‌వ‌చ్చ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. శక్తిమంతమైన నిర్మితీయ ప్రయోగాలు, కంప్యూటర్‌ ప్రతిరూపాలు ఉపయోగించి బ్యాట‌రీల ఛార్జింగ్‌కు సంబంధించిన‌ కారణాలను తెలుసుకున్నామ‌ని పేర్కొన్నారు. ధనాత్మక అయాన్లను చేర్చడం ద్వారా సొరంగ నిర్మాణాల్లో లిథియం ప్రవాహ వేగం పెరుగుతుందని దీంతో ఆయా బ్యాట‌రీలో తొంద‌ర‌గా ఛార్జ్ అవుతాయ‌ని తెలిపారు. ఈ ప‌రిశోధ‌న‌లు మరింత మెరుగైన బ్యాట‌రీల త‌యారీకి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు.

More Telugu News