పాకిస్థాన్ క్రికెటర్ కు తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ క్రికెటర్ కు తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర‌ సెహ్వాగ్ పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్కు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా త‌న‌దైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపాడు. డిసెంబర్ 29న‌ 41వ పడిలోకి అడుగుపెట్టిన ముస్తాక్కు ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. 2009, మార్చి 29వ తేదీన ముల్తాన్లో తాను పాకిస్థాన్‌పై చేసిన‌ ట్రిపుల్ సెంచరీని గుర్తు చేశాడు.

ఆ మ్యాచ్‌లో ముస్తాక్ బౌలింగ్లో తాను సిక్స్ కొట్టి ట్రిపుల్ సెంచ‌రీను పూర్తి చేసుకున్న వీడియోను ఆయ‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. ఆ వీడియో లూప్ను చూస్తూ ముల్తాన్ పుట్టిన‌రోజు వేడుక‌ను ఎంజాయ్ చేసుకోవాల‌ని పేర్కొన్నాడు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోమ‌ని చెప్పాడు. ఆ జ్ఞాపకాలే త‌న‌ ఆశీర్వాదాలు అంటూ  పేర్కొన్నాడు. చివ‌రిగా తాను చేసిన ఈ బర్త్ డే విషెస్ను ఎవరూ అధిగమించలేరంటూ పేర్కొన్నాడు.
cricket
sehwag

More Telugu News