ఈ నాలుగు యాప్స్ వాడారంటే... ఇక మీ సమాచారం పాకిస్థాన్ చేతిలో పడ్డట్టే!
ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. 'టాప్ గన్' అనే గేమింగ్ యాప్, 'యంపీ జంకీ' అనే మ్యూజిక్ యాప్, 'బీడీ జంకీ' అనే వీడియో యాప్, 'ట్రాకింగ్ ఫ్రాగ్' అనే ఎంటర్ టైన్ మెంట్ యాప్ లను పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ నిపుణులు నిర్వర్తిస్తున్నారని, మీరు ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటే మీ సమాచారం మొత్తం పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ గుప్పిట్లో ఉంటుందని వారు హెచ్చరించారు.