ఈ నెల 10 వ‌ర‌కు రూ.12.44 ల‌క్ష‌ల కోట్ల పాత‌నోట్లు జ‌మ: ఆర్‌బీఐ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ నెల 10 వ‌ర‌కు రూ.12.44 ల‌క్ష‌ల కోట్ల పాత‌నోట్లు జ‌మ: ఆర్‌బీఐ

తాము ఇటీవల తీసుకొచ్చిన కొత్త‌నోట్ల‌ను దాచుకుకోకుండా వినియోగంలోకి తేవాల‌ని ఆర్‌బీఐ అధికారులు ఈ రోజు ప్ర‌జ‌ల‌ను కోరారు. ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడుతూ... పెద్ద‌నోట్ల ర‌ద్దు ప్ర‌క్రియ ప్రారంభం నుంచి బ్యాంకు ఉద్యోగులు చేసిన‌ కృషి అభినంద‌నీయమ‌ని అన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా జ‌రిగిన‌ కొన్ని అక్ర‌మ‌లావాదేవీల్లో కొంద‌రు బ్యాంకు సిబ్బంది పాత్ర ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. అన్ని లావాదేవీలపై నిఘా పెట్టామ‌ని,  అనుమానాస్ప‌ద లావాదేవీల‌పై ద‌ర్యాప్తు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. ఈ నెల 10 వ‌ర‌కు రూ.12.44 ల‌క్ష‌ల కోట్ల పాత‌నోట్లు బ్యాంకులలో జ‌మ అయినట్లు తెలిపారు.
rbi

More Telugu News