: రైలు సమయాన్ని తప్పుగా చెప్పి ఇబ్బందులు పెట్టిన ఐఆర్సీటీసీకి జరిమానా

రైలు సమయాన్ని తప్పుగా చెప్పి, ఓ ప్రయాణికుడిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన రైల్వే శాఖ అనుబంధ ఆన్ లైన్ సేవల సంస్థ ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)కి థానే వినియోగదారుల ఫోరం రూ. 7 వేల జరిమానాను విధించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నవీ ముంబైకి చెందిన గోపాల్ బకత్ లాల్ జీ బజాజ్ అనే వ్యక్తి, మే 5, 2013న నాగపూర్ నుంచి ముంబై ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైలులో అమరావతి నుంచి ముంబై వెళ్లేందుకు ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నాడు. అతనికి సీట్ కన్ఫర్మ్ కాగా, ప్రయాణానికి ముందు రైలు సరైన సమయానికి వస్తున్నట్టు మెసేజ్ వచ్చింది. ఆపై స్టేషనుకు వెళ్లిన అతనికి రైలు నాలుగున్నర గంటలు లేటని తెలిసింది. ముంబైలో ఉన్న అత్యవసర పని దృష్ట్యా, అతను మరో రైలు వస్తుంటే, జనరల్ టికెట్ కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతూ ప్రయాణించాడు. ఆపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా, విచారించిన కోర్టు, ఇందులో ఐఆర్సీటీసీ నిర్లక్ష్యం ఉందని తేల్చింది. టికెట్ బుకింగ్ డబ్బులతో పాటు మానసిక క్షోభకు గురి చేసినందుకు రూ. 5 వేలు, ఫోరం ఖర్చుల కింద రూ. 2 వేలను 12 శాతం వడ్డీతో చెల్లించాలని తీర్పిచ్చింది.

More Telugu News