కురుక్షేత్రం

కౌరవ పాండవుల మధ్య జరిగిన మహాభారత యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. ఇరువర్గాల మధ్య 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కోరోజు ఒక్కో వ్యూహం నిర్మిస్తూ కౌరవ పాండవులు యుద్ధం చేశారు. ఒకరి సేనలను ఒకరు నిలువరించడానికి పన్నిన ఆ వ్యూహాలు ఆనాటి రాజనీతిని ... యుద్ధ పరిజ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ వుంటాయి.

ఎత్తుకు పైయ్యెత్తుగా కౌరవ పాండవులు నిర్మించిన ఆ వ్యూహాల వివరాల్లోకి వెళితే ... యుద్ధం మొదటి రోజున దృష్టద్యుమ్నుడు 'క్రౌంచారుణ వ్యూహం' నిర్మించగా ... రెండవ రోజున భీష్ముడు 'మహా వ్యూహం' పన్నాడు. ఇక మూడవ రోజున భీష్ముడు 'గరుడ వ్యూహం' పన్నగా అందుకు ప్రతిగా ద్రుష్ట ద్యుమ్నుడు 'అర్ధచంద్ర వ్యూహం' పన్నాడు. నాల్గొవ రోజున భీష్ముడు 'వ్యాల వ్యూహం' అయిదవ రోజున 'మకర వ్యూహం' నిర్మించాడు. మకర వ్యూహానికి ప్రతిగా ద్రుష్టద్యుమ్నుడు శ్యేన వ్యూహరచన చేశాడు.

ఆరవ రోజున అభిమన్యుడు 'సూచీ ముఖ' వ్యూహ రచన చేశాడు. ఏడవ రోజున భీష్ముడు 'మండల వ్యూహం' పన్నగా అందుకు ప్రతిగా ధర్మరాజు 'వజ్ర వ్యూహం ఏర్పాటు చేశాడు. ఎనిమిదవ రోజున భీష్ముడు 'మహావ్యూహం' నిర్మించగా ... ద్రుష్ట ద్యుమ్నుడు 'శృంగాటక వ్యూహం' నిర్మించాడు. తొమ్మిదవ రోజున భీష్ముడు 'సర్వతో భద్ర' వ్యూహ రచన చేశాడు.

ఇక ఆ తరువాత ద్రోణాచార్యుడు 'శకట వ్యూహం' ... 'మండలార్ధ వ్యూహం' ... 'పద్మ వ్యూహం' పన్నాడు. ఇక కర్ణుడు 'బార్హస్పత్య వ్యూహం' పన్నగా ... ద్రుష్ట ద్యుమ్నుడు మహా వ్యూహ రచన చేశాడు. ఇలా ఒక్కో వ్యూహంతో తమ సేనలను ముందుకు నడిపిస్తూ కౌరవ పాండవులు జరిపిన కురుక్షేత్ర యుద్ధంలో చివరికి పాండవులు విజయం సాధించారు.


More Bhakti News