సంపదలనిచ్చే శ్రీనివాసుడు
కలియుగంలో భక్తజన బాంధవుడు వేంకటేశ్వరుడు. ఆయన ఎక్కడ వుంటే అక్కడ సంపద వుంటుంది ... వేల కళ్లతో చూడగలిగే వైభవం వుంటుంది. వైకుంఠము నుంచి నేరుగా స్వామి తిరుమల కొండలపై దిగి అక్కడ ఆవిర్భవించి, అశేష భక్తజనకోటిచే పూజలు అందుకుంటున్నాడు. అ దివ్యమంగళ స్వరూపాన్ని అనునిత్యం దర్శించుకోవాలనే ఉద్దేశంతో, అలాంటి మూర్తిని అనేక ప్రాంతాలలోని ఆలయాలలో భక్తులు ప్రతిష్ఠించుకున్నారు.
ఈ నేపథ్యంలో నిర్మించబడినదే హైదరాబాద్ - వనస్థలిపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం. భక్తులు ఒక బృందంగా ఏర్పడి ఇక్కడి ఆలయాన్ని తమ అభిరుచికి తగినట్టుగా నిర్మించుకున్నారు. ఆలయం రెండు అంతస్తులుగా తీర్చిదిద్దబడింది. క్రింది అంతస్తులో ఒకవైపున స్వామివారి వంటశాలను ఏర్పాటుచేశారు. మరోవైపున స్వామివారి సేవలకు ఉపయోగించే వివిధ రకాల వాహనాలను ఉంచుతారు.
ఇక పైభాగంలో విశాలమైన ముఖమంటపం ... గర్భాలయం కనిపిస్తాయి. గర్భాలయంలో దాదాపు పది అడుగుల వేంకటేశ్వరస్వామి విగ్రహం నిండుగా ... కనుల పండుగగా దర్శనమిస్తూ వుంటుంది. అణువణువునా సౌందర్యం ఉట్టిపడే ఆ సమ్మోహన రూపాన్ని చూడగానే, మనసు పరవశిస్తుంది ... హృదయమనే సరస్సులోని భక్తి కమలం వికసిస్తుంది. గర్భాలయానికి ఇరువైపులాగల ప్రత్యేక మందిరాలలో పద్మావతీదేవి - గోదాదేవి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.
ఆలయంలో భక్తుల రద్దీ ఎప్పుడూ వుంటుంది. ఇక శనివారాల్లోను ... పర్వదినాల్లోను భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుంటుంది. ప్రతియేటా ఆశ్వీయుజ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఆధ్యాత్మిక ప్రసంగాలు ... సంగీత కచేరీలు జరిగేందుకు వీలుగా విశాలమైన వేదికను ఏర్పాటుచేశారు. ఆ పక్కనే స్వామివారి కళ్యాణ మంటపం దర్శనమిస్తుంది.
వందాలాదిమంది కూర్చోవడానికి వీలుగా సమస్త వసతి సౌకర్యాలతో నిర్మించబడిన ఈ కళ్యాణ మంటపంలో వివాహ శుభకార్యాలు జరుపుతుంటారు. కాలనీవాసుల పట్ల కల్పవృక్షంగా అలరారుతోన్న ఇక్కడి స్వామిని దర్శించడం వలన దారిద్ర్యం నశించి సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు ... నిరంతరం ఆ కొండంత దేవుడిని కొలుస్తూ తరిస్తుంటారు.