అవంతీపురం
ఆధ్యాత్మిక పరమైన వాతావరణానికి ఆహ్లాదకరమైన వాతావరణం తోడైతే ఆ క్షేత్రం నుంచి వెంటనే వెనక్కి రావాలనిపించదు. ఇక ఆ క్షేత్రం ఏ గుట్టపైనో ... కొండపైనో వుంటే మరింత రమణీయంగా అనిపిస్తుంది. దైవ సన్నిధిలో కూర్చుని అక్కడి పచ్చదనాన్ని ... ప్రశాంతతను ఆనందంగా ఆస్వాదించాలనిపిస్తుంది. ఆధ్యాత్మిక పరిమళంతో పాటు ఇలాంటి అనుభూతిని అందించే మనోహరమైన క్షేత్రం మనకి 'అవంతీపురం'లో కనిపిస్తుంది.
జానపద కథల్లో అందంగా కనిపించే ఈ పేరు అందరికీ సుపరిచితమే. అలాంటి ఈ క్షేత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడెం మండలంలో దర్శనమిస్తుంది. ప్రకృతిమాత కనుబొమల్లా కనిపించే ఇక్కడి గుట్టలపై 'శ్రీవేంకటేశ్వరస్వామి' ... 'శ్రీ సరస్వతీ దేవి' ఆలయాలు అలరారుతున్నాయి. మిర్యాలగూడ నుంచి కోదాడ వెళ్లే రహదారి పక్కన ... మూసీనదీ సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
ఈ జంట దేవాలయాలకు ఇటు మెట్ల మార్గం ... అటు వాహనాలు వెళ్లే మార్గం వున్నాయి. మత్స్యాకారాన్ని పోలిన గుట్టపై కళ్యాణ వేంకటేశ్వర స్వామి, శ్రీచక్రాన్ని పోలిన గుట్టపై శ్రీ సరస్వతీదేవి అమ్మవారు కొలువై వుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మెట్ల మార్గం ప్రారంభంలో, ఓ వైపున సీతారాముల మందిరం ... మరో వైపున వినాయకుడి మందిరం కనిపిస్తాయి.
విశాలమైనటు వంటి గుట్ట పైభాగానికి చేరుకుంటే, అందంగా తీర్చిదిద్దబడిన ఆలయంలో శ్రీదేవి - భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తూ వుంటాడు. ప్రతి సంవత్సరం 'మాఘశుద్ధ పంచమి' రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంటుంది. ఈ సందర్భంగా వేలాదిగా వచ్చిన భక్తులు, అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో పాల్గొని తరిస్తుంటారు.
ఇక ఉగాది ... విజయదశమి పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. గుట్టపై అన్నిరకాల వసతి సౌకర్యాలు ఉండటంతో వివాహవేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక వాహన పూజలకు ఈ క్షేత్రం పెట్టింది పేరుగా వెలుగొందుతోంది. ఇక్కడి వేంకటేశ్వర స్వామిని వేడుకుంటే ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక మరో గుట్టపైకి వెళితే,అనేకరకాల పూలమొక్కల మధ్య శ్రీ సరస్వతీదేవి అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది.
గర్భాలయంలో అమ్మవారు నెమలి వాహనంపై కూర్చుని భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. శ్రావణ ... కార్తీక ... మాఘ మాసాల్లో ఈ తల్లి సన్నిధిలో అక్షరాభ్యాసాలు విరివిగా జరుగుతుంటాయి. ముఖ్యంగా 'శ్రీ పంచమి' రోజున భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఇక్కడి నుంచి చాలాదూరం వరకూ గల పచ్చని పొలాలు ... పంటకాలువలు ... గుట్టలు నయనానందకరంగా దర్శనమిస్తూ వుంటాయి.
మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగించే క్షేత్రం కావడంతో, కార్తీక వనభోజనాలకు ఇక్కడికి తరలి వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే వుంటుంది. సాధారణంగా 'మానవసేవయే మాధవ సేవ' అని అంటూ వుంటారు. అయితే ఆ ఇద్దరికీ సేవలను అందించే వ్యక్తిగా డాక్టర్ తిపిర్నేని శరత్ బాబు కనిపిస్తారు. ఓ వైద్యుడిగా రోగులకు ఆయన సేవలను అందిస్తూనే, మరోవైపున ఈ ఆలయాలను నిర్మించారు. ఈ జంట దేవాలయాల నిర్వహణకు సంబంధించిన వ్యవహారాలను పాలడుగు పరశురామయ్య పర్యవేక్షిస్తూ వుంటారు.భక్తులకు ఈ క్షేత్ర దర్శనం ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.